Crime News: ఐఐటీ విద్యనభ్యసిస్తున్న ఆ యువకుడి కళ్లు కామంతో మూసుకుపోయాయి. మరో సంవత్సరం విద్య పూర్తయితే డిగ్రీ పట్టాతో హాయిగా ఉద్యోగంలో చేరాల్సిన ఆ యువకుడు ఓ దురాగతానికి పాల్పడి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. అసహాయురాలైన ఓ దివ్యాంగురాలిపై పశువులా మారి లైంగికదాడికి పాల్పడి దుర్మార్గానికి ఒడిగట్టాడు.
Crime News: మహారాష్ట్రంలోని ఠానే ప్రాంతానికి చెందిన అద్వైత్ కొచారే (23) అనే యువకుడు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల్లో ఇటీవలే తన ఇంటికి వచ్చాడు. అదే ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల దివ్యాంగురాలైన ఓ బాలికపై అతని కళ్లుపడ్డాయి. ఆ బాలికపై తన పశువాంఛ తీర్చుకోవాలనే పన్నాగం పన్నాడు.
Crime News: కొత్త బట్టలు కొనిస్తానని ఆ మైనర్‌కు కొచారే ఆశ చూపించాడు. తెలిసిన వ్యక్తి కదా అని నమ్మి అతని వెంట పోయింది. ఇదే అదనుగా భావించిన ఆ దుండగుడు ఆ మైనర్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. అతని దుర్మార్గాన్ని ఆ బాలిక తన తల్లికి చెప్పుకున్నది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
Crime News: ఇదిలా ఉండగా, ఆ బాలికపై లైంగికదాడి ఘటనను ఆ దుండగుడు వీడియో తీసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే గాక అతని ఫోన్‌లో ఇతర అమ్మాయిలకు సంబంధించిన అభ్యంతరకర పొటోలు, వీడియోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వాటిపైనా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.