Crime News: అనుమానమే పెనుభూతమైంది.. తరచూ పడే గొడవలు ముదిరి పాకానపడ్డాయి.. ఈ దశలో సహనం కోల్పోయిన ఆ వ్యక్తి తన భార్యను విచక్షణారహితంగా గొడ్డలితో నరికి చంపాడు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తన భార్యను చూసి భీతిల్లిన అతను పరుగున వెళ్లి సమీపంలో వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంతో ఇద్దరూ లోకం విడిచి వెళ్లడంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.
Crime News: మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండల పరిధిలోని బొక్కలోనిపల్లి గ్రామానికి చెందిన రాజేశ్ (35), సరిత (30) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల తన భార్య ప్రవర్తనలో అనుమానం పెంచుకున్న రాజేశ్ తరచూ గొడవపడేవారు. ఎవరితోనో వివాహేతర బంధం ఉన్నదనే అనుమానం రాజేశ్‌లో పెనుభూతమైంది. వారిద్దరి మధ్య గొడవలు ఇటీవల పెరగసాగాయి.
Crime News: గురువారం ఇద్దరూ కలిసి బంధువుల ఇంట జరిగిన పెళ్లికి వెళ్లొచ్చారు. ఇంటికి తిరిగి రాగానే మళ్లీ అదే విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. ఈ సమయంలో రాజేశ్ కోపంతో ఊగిపోయాడు. అసహనంతో ఆవేశం పెంచుకొని ఒక్కసారిగా గొడ్డలితో భార్యపై విచక్షణారహితంగా రాజేశ్ దాడికి దిగాడు. దీంతో ఆమె అక్కడికక్కడే పడిపోయి రక్తపు మడుగులోనే కన్నుమూసింది.
Crime News: తన భార్య రక్తపు మడుగులో కొట్టుకోవడాన్ని కళ్లారా చూసిన రాజేశ్.. మళ్లీ విచక్షణ కోల్పోయాడు. వెంటనే పరుగుతీశాడు. సమీపంలో ఉన్న రైల్వే లైన్ వద్దకు చేరుకున్నాడు. అటుగా వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలతో తల్లిదండ్రులు ఇద్దరూ లోకం విడిచి వెళ్లడంతో వారి పిల్లలిద్దరూ అనాథలుగా మిగిలారు. చూశారా? గొడవలు ప్రతి కుటుంబంలో జరుగుతున్నా.. సామరస్యంతో పరిష్కరించుకోవాలే తప్ప.. క్షణికావేశాలతో ప్రాణాలు తీసుకుంటే ఇక్కడ ఈ పిల్లలకు జరిగిన గతే పడుతుందన్నమాట.

