Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. తన ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపి, ఆ పిల్లల తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకున్నది. పిల్లలు, తన చావుకు ఆ తండ్రి రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టు ఓ చిన్న కారణం చూపినా, మరేదైనా పెద్ద కారణం ఉండి ఉంటుందని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులను చంపిన వైనంపై విస్మయం వ్యక్తమవుతున్నది. అసలు జరిగిన విషయమేంటో తెలుసుకుందాం రండి.
Crime News: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. హోలీ పండుగ సందర్భంగా చంద్రకిశోర్ తన భార్య తనూజను, ఇద్దరు కుమారులైన ఒకటో తరగతి చదివే జోషిల్ (7), యూకేజీ చదివే నిఖిల్ (6)ను తీసుకొని ఆఫీస్‌కు వెళ్లాడు. తన భార్యను అక్కడే ఉండాలని, పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నట్టు నమ్మించి పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్లాడు.
Crime News: చంద్రశేఖర్ తన ఇంటిలో ఈ సమయంలోనే దారుణానికి పాల్పడ్డాడు. తన ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నిండా నీళ్లున్న బకెట్‌లో తలలను ముంచి చంపేసి, ఆ తర్వాత తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 10 నిమిషాల్లో వస్తానన్న భర్త, పిల్లలూ ఎంతకీ రాకపోవడంతో, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అతని భార్య కొందరు తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లింది.
Crime News: ఇంటి కిటికీలో నుంచి చూడగా ఘోరం బయటపడింది. తలుపులు పగులగొట్టి చూడగా, భర్త ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉండగా, పిల్లలిద్దరూ నీళ్లున్న బకెట్‌లో తలలు మునిగి చనిపోయి ఉన్నారు. ఇంటిలో వెతకగా చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు తెలిపారు. అందులో ఉన్న విషయాలు విస్తుగొల్పుతున్నాయి.
Crime News: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీపడలేకపోతున్నారని, చదవలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే తన ఇద్దరు పిల్లలను చంపి, తాను కూడా చనిపోతున్నానని చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోట్‌లో రాసి ఉన్నదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, చంద్రశేఖర్ సోదరుడు మరో రకంగా చెప్తున్నారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.
Crime News: చిన్నారులు, అందునా ఒకటో తరగతి, యూకేజీ చదివే రోజుల్లో ఆ పిల్లల భవిష్యత్తు నిర్ధారణ కాదనే విషయం సభ్య సమాజం కూడా పేర్కొంటున్నది. చంద్రశేఖర్ ఈ విషయం తెలుసుకోలేకపోయారా? అని ప్రశ్నిస్తున్నది. లేదా మరేదైనా కారణం ఉంటుందని అత్యధికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై ఈ రోజుల్లో అమితమైన ప్రేమను చూపే తల్లిదండ్రులు ఉంటారని, చదువు విషయంలో చంపుకోరని, మరేదో బలమైన కారణం ఉంటుందని అంటున్నారు.