Crime News: ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ అత్యాశకు పోయాడు.. ఉద్యోగ విధుల్లో విపరీతానికి ఒడిగట్టాడు.. చివరికి తనతోపాటు బంధువును కూడా జైలు ఊచలు లెక్కించే పనిచేశాడు.. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉద్యోగ వర్గాల్లో సైతం విస్మయం కలిగించకమానదు. అదే శాఖలో ఇతర ఉద్యోగుల విధులను ప్రశ్నార్థకం చేశాడు.
Crime News: వికారాబాద్ జిల్లా తాండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో గులాం సుల్తాన్ అహ్మద్ (52) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తాండూరు ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడిన గంజాయిని దహనం చేసేందుకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని నందిగామ వద్దకు తరలిస్తుండగా, వాటిల్లో ఓ కిలొన్నర గంజాయి ప్యాకెట్‌ను తస్కరించాడు.
Crime News: ఆ ప్యాకెట్‌ను అమ్మేందుకు తన బంధువైన షాద్‌నగర్‌కు చెందిన మహ్మద్ అంజాద్‌కు ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్ అప్పగించాడు. అయితే షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్ ఈద్గా వద్ద గంజాయిని విక్రయించేందుకు వెళ్తున్న అంజాద్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో గంజాయి ప్యాకెట్ బయటపడింది.
Crime News: పోలీసుల విచారణలో అంజాద్ అసలు విషయం కక్కేశాడు. తన బంధువైన ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్ బాగోతాన్ని బయటపెట్టాడు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విధుల్ల్లో ఉండి స్వార్థంతో కొట్టేసిన గంజాయిని అమ్మాలని చూసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్టయి కటకటాల పాలయ్యాడు.