Crime News: సమాజంలో దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. నీతి, నిజాయితీలు కనుమరుగవుతున్నాయి. ఉచ్ఛం నీచం లేకుండా పోతున్నది. వావి వరుసలు కానరావడం లేదు. చిన్నా పెద్ద తేడా తెలియడమే లేదు. ఇలా ఎందరో దుండగులు దారుణాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులపైనా అమానుష చర్యలకు దిగుతున్నారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట లైంగిక దాడులు, వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి.
Crime News: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మైనర్‌పై జరిగిన లైంగికదాడి యత్నం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నది. ఇదే మండలానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి తనకు వరుసకు కూతురయ్యే మైనర్ బాలికకు బట్టలు కొనిస్తానని తన వెంట బయటకు తీసుకెళ్లాడు. అభం శుభం తెలియని ఆ బాలిక సంతోషంతో ఎగిరి గంతేసింది కానీ, తనను అగాధంలోకి నెట్టివేస్తాడని మాత్రం ఊహించలేకపోయింది.
Crime News: ఆ దుండుగుడు బాలికను నేరుగా ఓయో రూముకు తీసుకెళ్లాడు. అదే చోట ఆమెపై లైంగికదాడి చేసేందుకు యత్నించాడు. ఈ సమయంలో ఆ బాలిక ప్రతిఘటించింది. పెద్దగా కేకలు వేస్తూ అతడి భారి నుంచి రక్షణ కోసం బయటకు పరుగులు తీసింది. నేరుగా ఇంటికి వెళ్లిన ఆ బాలిక జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
Crime News: ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిభట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడు ఆంజనేయులుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలపై ఆడపిల్లలున్న తల్లిదండ్రులు తగు జాగ్రత్తగా ఉండాలని అటు పోలీసులు, మరోవైపు మానసిక విశ్లేషకులు సూచిస్తున్నారు.