Hari Hara Veeramallu Song

Hari Hara Veeramallu Song: మాట వినాలి.. అంటూ దుమ్ములేపుతున్న పవన్ కళ్యాణ్‌!

Hari Hara Veeramallu Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’లోని ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు పెంచలదాస్ సాహిత్యాన్ని అందించగా, కథానాయకుడు పవన్ కళ్యాణ్ దీనిని ఆలపించడం విశేషం. బ్రిటీషర్స్ మీద పోరాటం చేసిన తెలంగాణ బిడ్డ హరిహర వీరమల్లు  గాధగా ఈ సినిమాను క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ నాయికగా నటించిన ‘హరిహర వీరమల్లు’లో బాబీ డియోన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తొలి భాగం ‘హరిహర వీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఐదు భాషల్లో మార్చి 28న విడుదల కాబోతోంది.

Hari Hara Veeramallu Song: అప్పుడప్పుడు తన సినిమాలో ఒక పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించే పవన్ కళ్యాణ్ . . చాలాకాలం తరువాత మళ్ళీ హరి హర వీర మల్లు కోసం మాట వినాలి అంటూ గొంతు విప్పడం విశేషం. పాటలో లిరిక్స్ అద్భుతంగ వచ్చాయి .  దానికి కీరవాణి మెలోడియస్ మ్యూజిక్ ప్లస్ అయింది. పవన్ కళ్యాణ్ స్టైల్ లో మెసేజ్ ఇస్తున్నట్టుగా సాగిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే మొదటి గీతాన్ని నిర్మాతలు ఆవిష్కరించారు. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం విశేషం.

సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ‘మాట వినాలి’ లిరికల్ వీడియోతో ‘హరి హర వీర మల్లు’ సంగీత ప్రయాణం మొదలైంది. “వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి” అంటూ తెలంగాణ మాండలికంలో పవన్ కళ్యాణ్‌ చెప్పే హృద్యమైన పంక్తులతో పాట ప్రారంభమైన తీరు అమోఘం. అందరూ పాడుకునేలా అర్థవంతమైన పంక్తులు, శక్తివంతమైన జానపద బీట్‌ లతో ‘మాట వినాలి’ గీతం మనోహరంగా ఉంది. పెంచల్ దాస్ అందించిన సాహిత్యం లోతైన భావాన్ని కలిగి ఉంది. మంచి మాటలను వినడం – వాటి నుండి వచ్చే జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అద్భుతమైన సందేశంతో ఈ పాట సాహిత్యం నడిచింది. ప్రతి వాక్యం విలువైన జీవిత పాఠాలను అందిస్తుంది. జీవితంలో సానుకూలత – ధర్మాన్ని స్వీకరించడానికి శ్రోతలను ప్రోత్సహిస్తుంది.

ALSO READ  Mahaa Vamsi: విశాఖలో త్రిమూర్తులు..పోటెత్తిన జనాలు

అటవీ నేపథ్యంలో చిత్రీకరించిన ‘మాట వినాలి’ పాట విజువల్స్ ఆకట్టుకున్నాయి. అడవిలో మంట చుట్టూ వీరమల్లు అనుచరుల బృందం గుమిగూడినట్లుగా లిరికల్ వీడియోలో చూపించారు. ఇక పవన్ కళ్యాణ్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ లు పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ మనోహరమైన, ఆకర్షణీయమైన గీతం సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేలా ఉంది. ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా ఆలపించి ఈ పాటకు మరింత అందాన్ని జోడించారు. తనదైన గాత్రంతో మొదటి నుండి చివరి వరకు శ్రోతలను కట్టిపడేసేలా చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *