Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఐఏఎస్ దురాగతం బయటకొస్తున్నది. గత ప్రభుత్వంలో కీలకమైన శాఖకు అధిపతిగా వ్యవహిరించి, సీఎం పేషీలో కూడా పనిచేసిన ఆ అధికారికి ఇప్పుడు మసి అంటుకున్నది. హైదరాబాద్‌లో ఉండే ఓ మహిళతో వివాహేతర బంధం పెట్టుకొన్న ఆ ఐఏఎస్ అధికారి.. తన సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని ఆరోపణలు వచ్చాయి.
Crime News: సదరు ఐఏఎస్ అధికారి ఇటీవల వివాహేతర బంధం పెట్టుకున్న మహిళతో హైదరాబాద్‌లోనే ఎక్కువగా గడుపుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళకు అనారోగ్యంతో బాధపడుతూ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ సమయంలో ఆ మహిళ వేరే వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిందని ఆ ఐఏఎస్ అధికారి అనుమానం పెంచుకున్నాడు. అదే విషయమై ఆమెతో గొడవపడసాగాడు.
Crime News: ఆ మహిళతో గొడవ పడుతున్న సమయంలో ఐఏఎస్ అధికారి తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆమెపై దాడి చేసి తలను గోడకేసి కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై ఆ మహిళ ప్రాణాలు విడిచింది. ఇక్కడే ఆ అధికారి తన పలుకుబడిని వినియోగించాడు. మెట్లపై నుంచి కింద పడిపోయిందని ఆసుపత్రి రికార్డుల్లో రాయించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు విజయవాడకు వెళ్లి ఎంచక్కా విధుల్లో చేరిపోయాడు.
Crime News: క్షణికావేశంతో వివాహేతర బంధమున్న మహిళను దారుణంగా చంపిన ఆ ఐఏఎస్ అధికారి విషయం బయటకు పొక్కింది. దీంతో అటు తోటి అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అనుమానమే పెనుభూతమై ఓ మహిళ చావుకు కారణమైన ఆ ఐఏఎస్ పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుందని తెలుస్తున్నది.