Cricket: శుభ్‌మన్ గిల్‌కు కొత్త నాయకత్వ బాధ్యత: దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ కెప్టెన్‌గా ఎంపిక

Cricket: టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్కి మరో కీలక బాధ్యత దక్కింది. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన గిల్, ఇప్పుడు దేశవాళీ టోర్నమెంటు అయిన దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఈ టోర్నీ ఆగస్టు 28 నుంచి బెంగళూరులో ప్రారంభం కానుంది. గత టెస్టు సిరీస్‌లో గిల్ అద్భుతంగా రాణించి, ఐదు మ్యాచ్‌లలో 754 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శన తర్వాతే ఈ నాయకత్వ బాధ్యత అతనికి లభించింది.

జోనల్ సెలక్షన్ కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశమై 15 మంది సభ్యులతో కూడిన నార్త్ జోన్ జట్టును ప్రకటించింది. తొలిసారిగా టోర్నీ పాత ఫార్మాట్ ప్రకారమే ఆరు జోన్ల మధ్య నిర్వహించనున్నారు. ఈ ఏడాది టోర్నీ ద్వారా 2025-26 దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభమవుతుంది.

నార్త్ జోన్ జట్టు, మొదటి క్వార్టర్ ఫైనల్‌లో ఈస్ట్ జోన్తో తలపడనుంది, దీనికి ఇషాన్ కిషన్ నాయకత్వం వహించనున్నాడు. గెలిచే జట్టు సెమీఫైనల్‌లో సౌత్ జోన్‌ను ఢీకొంటుంది.

జట్టులో ప్రధాన ఆటగాళ్లు:

అర్ష్‌దీప్ సింగ్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్)

హర్షిత్ రాణా (పేస్ ఆల్‌రౌండర్)

అన్షుల్ కాంబోజ్ (ఇంగ్లండ్‌లో టెస్టు అరంగేట్రం)

యశ్ ధుల్ (అండర్-19 వరల్డ్‌కప్ విజేత జట్టు కెప్టెన్)

ఆయుష్ బదోని (ప్రత్యభాశాలి ఆల్‌రౌండర్)

జమ్మూ కశ్మీర్ నుంచి నాలుగు మంది ఆటగాళ్లు ఎంపిక కావడం విశేషం:

శుభమ్ ఖజూరియ

సాహిల్ లోత్రా

యుధ్వీర్ సింగ్

అకిబ్ నబీ

ఆసియా కప్‌పై అనుమానాలు:

సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 నేపథ్యంలో, గిల్, అర్ష్‌దీప్, రాణాల్లలో ఎవరైనా భారత జట్టుకు ఎంపికైతే, స్టాండ్‌బై ఆటగాళ్లు వారి స్థానాలను భర్తీ చేస్తారని సెలక్షన్ కమిటీ తెలిపింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *