CP Sajjanar: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గారు వాహనదారులకు ఒక బిగ్ అలర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి గట్టి హెచ్చరిక చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండేవారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
డ్రైవింగ్‌లో ఈ పనులు అస్సలు చేయొద్దు!
సీపీ సజ్జనార్ గారి వార్నింగ్ దేని గురించంటే… చాలా మంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లో వీడియోలు చూడడం లేదా ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, చట్టరీత్యా శిక్షార్హమైన నేరం అని ఆయన చెప్పారు.
ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే… నగరంలో తిరిగే ఆటో రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు తరచుగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వాహనం నడుపుతూ ఫోన్లో లీనమైపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సీపీ సజ్జనార్ అన్నారు.
🚦 Many drivers, including auto-rickshaw and cab/bike taxi drivers, are often seen watching videos or using earphones while driving. This is dangerous and a punishable offence. Hyderabad Traffic Police will take strict action against such violators.
Safety of self, passengers,… pic.twitter.com/n87ZCbu3Ip
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 7, 2025
కఠిన చర్యలు, భారీ జరిమానాలు ఖాయం!
ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లు కఠిన చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు కూడా విధిస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
డ్రైవింగ్ చేసే వారి భద్రతతో పాటు, వాహనంలో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై వెళ్లే ఇతర ప్రజల సేఫ్టీ కూడా చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.
జీవితం కంటే పెద్ద సమస్య ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. అని సీపీ సజ్జనార్ ప్రజలను కోరారు.