Cowpeas

Cowpeas: అలసందలు: ఈ చిన్న గింజల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు!

Cowpeas: మ‌న ఆహారంలో మనం తరచుగా ఉపయోగించే బొబ్బ‌ర్లు (అలసందలు) ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో తక్కువ కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. అలాగే, పోష‌క విలువ‌లు, పీచు ప‌దార్థం (ఫైబ‌ర్‌) సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.

బొబ్బర్లలో పోషకాలు:
బొబ్బర్లలో విటమిన్‌ ఎ, బి1, బి2, బి3, బి5, బి6, సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే, ఐరన్, రాగి, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, అనేక రోగాల నుంచి రక్షణ కల్పించడానికి సహాయపడతాయి.

Also Read: Dandruff Remedies: చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇవి ట్రై చేయండి

బొబ్బర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: 
బరువు తగ్గడం: బొబ్బర్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది, తక్కువగా తినడానికి తోడ్పడుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

గర్భిణులకు మేలు: బొబ్బర్లలో ఫోలేట్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణులకు ఎంతో మంచిది. గర్భంలోని శిశువు ఎదుగుదలకు, రక్తహీనతను తగ్గించడానికి తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యం: వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంతో పాటు, శరీరంలోని అంతర్గత వాపులను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

జీర్ణక్రియ మెరుగుపడడం: బొబ్బర్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి వాటిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కూడా సహాయపడుతుంది.

రక్తపోటు నియంత్రణ: వీటిలో ఉండే పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, ముఖ్యంగా అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం.

చర్మ సంరక్షణ: బొబ్బర్లలో ఉండే విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

రోగ నిరోధక శక్తి: రోజూ బొబ్బర్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Note: బొబ్బర్లతో వడలు, పునుగులు, దోశలు వంటివి చేసుకోవచ్చని, అలాగే, వీటిని ఉడకబెట్టి తినడం కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించి, వారి సలహా మేరకు వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *