Kollywood: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అందరూ ఊహించారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని తమిళ సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. కానీ, ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందని తాజా టాక్. కలెక్షన్లు ఎంతవరకు వచ్చాయి? ‘కూలీ’ సినిమా తొలి వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకుంది. అయితే, కథలో కొత్తదనం లేకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ మిస్ కావడంతో కలెక్షన్లు రూ.500 కోట్ల మార్క్‌ను కూడా చేరలేదు. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, మిక్స్‌డ్ టాక్‌తో ‘కూలీ’ అంచనాలను అందుకోలేకపోయి నిరాశపరిచింది.