Asia Cup trophy

Asia Cup trophy: నఖ్వీది పిల్ల చేష్టలు.. ఆ ట్రోఫీని తీసుకెళ్లే హక్కు అతనికి లేదు – బీసీసీఐ కార్యదర్శి ఫైర్

Asia Cup trophy: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించినా, భారత జట్టు ట్రోఫీని అందుకోకపోవడం సంచలనంగా మారింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ వేడుకలు హైడ్రామాగా మారాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత నిరాకరించింది. దీంతో గంటసేపు అలస్యమైన ప్రెజెంటేషన్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రమే రన్నరప్ మెడల్స్ అందగా, భారత జట్టు ట్రోఫీ లేకుండా చెలరేగింది. ఇది భారత్‌కు 9వ ఆసియా కప్ టైటిల్ అయినప్పటికీ, రాజకీయ ఉద్రిక్తతలు ఆనందాన్ని మసకబార్చాయి.

ప్రోటోకాల్ ప్రకారం ఏసీసీ చీఫ్ నఖ్వీకే విజేతకు ట్రోఫీ అందించాలి. కానీ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, నఖ్వీ పాక్ ప్రభుత్వంలో సీనియర్ నాయకుడిగా ఉండటం కారణంగా భారత జట్టు అతని నుంచి తీసుకోవడానికి సిద్ధం కాలేదు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, మేము ముందే నిర్ణయించుకున్నాం. అతని చేతుల మీదుగా తీసుకోకూడదు. పాక్ ప్రభుత్వంలో సీనియర్‌గా ఉన్నాడు కదా? అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటాం? ట్రోఫీ వద్దని కాదు, కానీ అతను తీసుకెళ్లే హక్కు ఎవరు ఇచ్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్, యూఏఈ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ అల్ జరూని లేదా బంగ్లాదేశ్ బోర్డు చైర్మన్ అమీనుల్ ఇస్లాం చేతుల మీదుగా తీసుకుంటామని ప్రతిపాదించింది. ఇద్దరూ అంగీకరించినా, నఖ్వీ మొండిపట్టి తానే అందిస్తానని చెప్పాడు.

Also Read: Ind vs Pak: పాక్‌ను చిత్తు చేసిన టీమ్‌ ఇండియా.. తొమ్మిదోసారి ఆసియా కప్‌ మనదే!

దీంతో సహనం కోల్పోయిన నఖ్వీ, ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను కూడా తన హోటల్ రూమ్‌కు తీసుకెళ్లిపోయాడు. సైకియా దీన్ని పిల్లల చేష్టల వ్యవహారం అని వ్యాఖ్యానించారు. “భారత జట్టు ఆడిన తీరు అద్భుతం. కానీ ఏసీసీ చైర్మన్ మాత్రం మనకు ట్రోఫీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే చేశాడు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం. మేము ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ట్రోఫీ, మెడల్స్ త్వరలోనే పంపిస్తారని ఆశిస్తున్నాం అని చెప్పారు. బీసీసీఐ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంపై నిరసన తెలుపుతుందని సైకియా స్పష్టం చేశారు.

ఈ డ్రామా సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది. #TrophyGate, #ChorNaqvi వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. భారత ఫ్యాన్స్ “నఖ్వీ ట్రోఫీతో పారిపోయాడు” అని మీమ్స్, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒక పోస్ట్‌లో “భారత ఆటగాళ్లు ఊహాజాల ట్రోఫీతో సెలబ్రేట్ చేశారు.. ఈ వివాదం భారత్‌కు 9వ ఆసియా కప్ టైటిల్‌ను మరింత ప్రత్యేకంగా మార్చింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *