Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఈ మూడు ప్రధాన పార్టీలు తమ గెలుపు బాణాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ బలమేంటో ఈ ఉపఎన్నికలో చూపిస్తాం. ప్రజల అభిమానం మాకు అండగా ఉంది. బీఆర్‌ఎస్ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేసేది ఇక సాధ్యం కాదు. ప్రజలు ఇప్పుడు అభివృద్ధి, నిజాయితీని మాత్రమే చూస్తారు” అని స్పష్టం చేశారు.
అతను ఇంకా మాట్లాడుతూ, “నన్ను ఎదుర్కొనే ధైర్యం బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు లేదు. అందుకే నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఓటర్ కార్డు కేసులో నేను నిర్దోషిని అని నిరూపిస్తాను. నేను బీసీ బిడ్డను అయినా అందరివాడినే. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన వారందరినీ కలుపుకుని ముందుకు సాగుతాను” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Atla Tadde: నేడు అట్ల తద్ది.. పెళ్లికాని అమ్మాయిలు చేయాల్సిన పని ఇదే !!
జూబ్లీహిల్స్ అభివృద్ధి విషయానికొస్తే, నవీన్ యాదవ్ మాట్లాడుతూ, “ఇప్పటికే రూ.180 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి పంథాను కొనసాగించడం మా లక్ష్యం” అని అన్నారు.
రాజకీయ విశ్లేషకుల ప్రకారం, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల దిశను నిర్ణయించగలదు. కాంగ్రెస్ పార్టీ తమ సత్తా చూపాలనుకుంటే, బీఆర్‌ఎస్ మరియు బీజేపీ తమ బేస్ నిలబెట్టుకునేందుకు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే, నవీన్ యాదవ్ వ్యాఖ్యలతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.