Supreme Court: ఎన్నికలకు సంబంధించిన పబ్లిక్ ఎలక్ట్రానిక్ పత్రాలను తయారు చేయడాన్ని నిలిపివేయాలన్న నిబంధనను కాంగ్రెస్ మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పోలింగ్ కేంద్రాల సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డింగ్‌లు వంటి కొన్ని ఎలక్ట్రానిక్ పత్రాలను పబ్లిక్‌గా ఉంచకుండా ఉండేందుకు డిసెంబర్ 20న కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిబంధనలను మార్చింది.
ఈ పిటిషన్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ- ఎన్నికల నిర్వహణ నిబంధనలు, 1961 వంటి ముఖ్యమైన చట్టంలో ఏకపక్ష సవరణలు చేయడానికి ఎన్నికల కమిషన్‌ను అనుమతించలేమని అన్నారు.
ఇది కూడా చదవండి: Jammu and Kashmir: లోయలో పడిన ఆర్మీ వ్యాన్.. ఐదుగురు సైనికుల మృతి!
Supreme Court: నిబంధనల మార్పు తర్వాత డిసెంబర్ 21న రమేష్ మాట్లాడుతూ – ఎన్నికల సంఘం పారదర్శకతకు ఎందుకు భయపడుతోంది? కమిషన్ ఈ చర్య పై త్వరలో న్యాయపరంగా సవాలు చేస్తాం అని చెప్పారు. అన్న విధంగానే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
ఎన్నికల సంఘం చట్టంలోని నిబంధనల ప్రకారం పదాన్ని చేర్చింది. డిసెంబరు 20న, ఎన్నికల సంఘం సిఫారసు మేరకు, న్యాయ మంత్రిత్వ శాఖ ఎన్నికల నియమావళి- 1961లోని రూల్ 93(2)(A)ని మార్చింది. రూల్ 93 “ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలు బహిరంగంగా అందుబాటులో ఉంటాయి.” అని ఉంటుంది. దీనిని “అన్ని ఎన్నికల సంబంధిత పత్రాలు ‘నిబంధనల ప్రకారం’ పబ్లిక్‌గా అందుబాటులో ఉంటాయి”గా మార్చారు. దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది.