Allu Arjun: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అల్లు అర్జున్ విమర్శలు చేస్తే సహించేది లేదని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అల్లు అర్జున్ సినిమాలను నడపనివ్వబోమని హెచ్చరించారు.
సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సినీరంగ ప్రముఖులకు హైదరాబాద్ లో భూములిచ్చి సినీ పరిశ్రమ ఇక్కడ వేళ్ళూడుకోవడానికి అవకాశం కలిపించిది అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అన్నారు. అసలు అల్లు అర్జున్ పుష్ప సినిమా ఏమాత్రం సమాజానికి మేలు చేసే సినిమా కాదు. అది ఓ స్మగ్లర్ కథ. అలాంటి సినిమా తీసిన వారు ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తారా? అంటూ విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి: AP SSC Exam Fees: పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
Allu Arjun: మీరు ఆంధ్రా నుండి వచ్చారు. మరొక్కసారి మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. నోటిని అదుపులో పెట్టుకోండి అని భూపత్ రెడ్డి అన్నారు. అసలు తెలంగాణకు మీరు చేసిన ఉపకారం ఏమిటి? తెలంగాణ ముఖ్యమంత్రిపై మాట్లాడటానికి మీరెవరు? మరొక్కసారి ఇలా జరిగితే మీ సినిమాలు తెలంగాణలో నడపడానికి ఎట్టిపరిస్థితిలోనూ ఒప్పుకోము. ఆంధ్రావాళ్ల సినిమాలు నడవనిచ్చేదే లేదు అంటూ ఘాటుగా హెచ్చరించారు ఎమ్మెల్యే. అనుమతి లేకుండా థియేటర్ లో సినిమా చూడటానికి అల్లు అర్జున్ వెళ్లారని చెప్పిన ఎమ్మెల్యే.. పోలీసులు వద్దని వారించినా రోడ్డు షో చేశారని ఆరోపించారు. తప్పు మీరు చేసి మా ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తారా? అంతో ఆగ్రహంగా ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి.
డిసెంబర్ 21 న అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకూ కౌంటర్ గా ఎమ్మెల్యే స్పందించినట్టు కనిపిస్తోంది. పుష్ప 2 విడుదల సందర్భంగా ప్రీమియర్ షో చూడటం కోసం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, దీనికి బాధ్యులుగా పోలీసులు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన అంతా రాజకీయ రంగు పులుముకుంటోంది. ప్రభుత్వం-ఫిలిం ఇండస్ట్రీ అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.