2024 Celebrities Marriages: 2024 అయిపోవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. అలాగే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బూస్టర్ కూడా చూసింది. వీటితోపాటు 30 పదులు దాటినా బ్యాచిలర్ గా ఉన్న సెలబ్రిటీస్ కూడా ఈ సంవత్సరం పెళ్లిళ్లు చేసింది అని చెప్పుకోవొచ్చు. కిరణ్ అబ్బవరం, కీర్తి సురేష్, చైతన్య, శోభిత సహా పలువురు హీరోలు, హీరోయిన్లు ఒకింటి వారయ్యారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇపుడు తెలుసుకుందాం.
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల అన్నపూర్ణ స్టూడియోస్ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2024 డిసెంబర్ 4న ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కొంతమంది బంధువులని మాత్రమే హ్వానించారు.
సిద్ధార్థ్ – అదితీరావు హైదరీ వీరు ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ చాలాకాలంగా వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. వచ్చినప్రతిసారి ఖండిస్తూ వచ్చారు. కానీ 2024లో సెప్టెంబరు 16న సిద్ధార్థ్ – అదితీరావు హైదరీ ఒకింటి వారయ్యారు.
2024 జూన్ 23న సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ మతాంతర వివాహాం చేసుకున్నారు.
రకుల్ ప్రీత్‌సింగ్..నిర్మాత అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో 2024 ఫిబ్రవరి 21న ఏడడుగులు వేసింది.
కృతి కర్బంద- పులకిత్ సామ్రాట్.. కృతి కర్బంద- పులకిత్ సామ్రాట్ 2024 మార్చి 15న వీరి ప్రేమ పెళ్లికి దారి తీసింది.కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరు ఢిల్లీలో సన్నిహితంగా పెళ్లి చేసుకున్నారు.
2024 నవంబర్ 28న ఆక్టర్ సుబ్బరాజు- స్రవంతి పెళ్లి చేసుకున్నారు.
రాజావారు రాణిగారు సినిమాతో ఇద్దరు హీరో హీరోయిన్ గా పరిచయం ఐన కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్ ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరి 2024 ఆగస్టు 22న కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ పెళ్లి చేసుకున్నారు.
2024 సంవత్సరం చివరిలో కీర్తి సురేష్ – ఆంటోని తట్టిల్.. 2024 డిసెంబర్ 12న కీర్తి సురేశ్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తట్టిల్ ను హిందూ వివాహా పద్దతితో పాటు క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేసుకోవడం విశేషం.
Beta feature
Beta feature
Beta feature
Beta feature
Beta feature
Beta feature