Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను నిన్న రాత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గ్యాస్ట్రో విభాగానికి చెందిన నిపుణులైన వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఆమె కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Sonia Gandhi: సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలియగానే, అనేక మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ త్వరలో సోనియా గాంధీ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని భావిస్తున్నారు.