Congress

Congress: మోదీ ఆర్ఎస్ఎస్ పోస్టుపై కాంగ్రెస్ విమర్శలు

Congress: దేశ నిర్మాణంలో ఆరెస్సెస్ కీలకపాత్ర పోషించిందన్న ప్రధాని నరేంద్రమోదీ పోస్టుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. గాంధీకి అత్యంత సన్నిహితుడైన ప్యారేలాల్ రాసిన మహాత్మాగాంధీ ద లాస్ట్ ఫేజ్ పుస్తకాన్ని ఉటంకిస్తూ.. ఆరెస్సెస్ ను “నిరంకుశ దృక్పథం కలిగిన మతసంస్థగా బాపూ అభివర్ణించినట్లు కాంగ్రెస్ గుర్తుచేసింది. పుస్తకంలోని వ్యాక్యల స్క్రీన్ షాట్ ను పోస్టు చేసిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ .. గాంధీ సంభాషణ తర్వాత ఐదు నెలలకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ RSSను నిషేధించారని తెలిపారు. RSS సృష్టించిన వాతావరణం వల్లే గాంధీ హత్య జరిగిందంటూ పటేల్ రాసిన లేఖ గురించి మోదీకి కనీసం తెలుసా అని జైరాం రమేశ్ ప్రశ్నించారు.

ఆరెస్సెస్ కార్యకలాపాలు దేశానికి ప్రభుత్వంతో పాటు దేశం ఉనికికి ముప్పుగా పరిణమించాయని పటేల్ చెప్పారని గుర్తుచేశారు. అటు శతాబ్ధి వేడుకలను జరుపుకుంటున్న ఆరెస్సెస్ ను కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కన్నూర్ లో ప్రసంగించిన సీఎం..ఇజ్రాయెల్ జియోనిస్టులు భారత్ లో ఆరెస్సెస్ కవల పిల్లలు అంటూ మండిపడ్డారు. RSS సేవలను గుర్తుచేస్తూ ప్రధాని నాణేన్ని విడుదల చేయడం రాజ్యాంగానికి అగౌరవపర్చడమే అని విజయన్ దుయ్యబట్టారు. మరోవైపు సమాజ సేవ, జాతి నిర్మాణమే లక్ష్యంగా ఆర్ ఎస్ ఎస్ ఏర్పాటైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Kantara Chapter 1 Review: కాంతార చాప్టర్ 1 రివ్యూ. ఎలా ఉందంటే..?

1925లో విజయదశమి రోజున ఒక ఉన్నతమైన లక్ష్యంతో RSSను స్థాపించినట్లు ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల వేళ.. మోదీ పోస్టు చేశారు. దేశానికి సేవ చేయడంలో సంఘ్ ఎప్పుడూ ముందుంటుందన్న ప్రధాని….శతాబ్ద కాలంతో ఎంతోమంది సంఘ్ కార్యకర్తలు దేశం కోసం జీవితాలను అంకీతం చేశారని చెప్పుకొచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *