Kapil Sharma: అమృత్సర్‌లో సామాన్య కుటుంబంలో జన్మించిన కపిల్ శర్మ, నీటి బాటిల్ ఫ్యాక్టరీలో రూ.500 జీతంతో కెరీర్‌ను ప్రారంభించాడు. తండ్రి క్యాన్సర్‌తో మరణించినప్పుడు కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినా, కపిల్ తన కలలను వదల్లేదు. థియేటర్‌లో నాటకాలు, చిన్న ఉద్యోగాలతో పోరాడి, ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ షోతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ షోలో విజేతగా నిలిచి రూ.10 లక్షలతో సోదరి పెళ్లి జరిపించాడు. ఆ తర్వాత కపిల్ వెనుదిరిగి చూడలేదు. ‘ది కపిల్ శర్మ షో’తో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు, సంవత్సరానికి రూ.35 కోట్లు సంపాదిస్తూ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. 2025 నాటికి రూ.300 కోట్ల ఆస్తులతో బ్రహ్మానందం, వడివేలు వంటి హాస్యనటుల సరసన నిలిచాడు. ముంబై, పంజాబ్‌లో ఖరీదైన ఆస్తులు, రూ.1.25 కోట్ల వోల్వో, రూ.1.2 కోట్ల మెర్సిడెస్ కార్లతో లగ్జరీ జీవితం గడుపుతున్నాడు. ఫోర్బ్స్ 2019 జాబితాలో 53వ స్థానం సాధించిన కపిల్, కష్టంతో ఖరీదైన కామెడీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.
