Cold Weather: మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ సహా 10 రాష్ట్రాల్లో మంగళవారం కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. 13 రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని హెచ్చరికలు చేసింది వాతావరణ శాఖ. ఇక ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని 12 జిల్లాలు చలిగాలులతో అల్లాడిపోతున్నాయి. 53 సంవత్సరాల తర్వాత, డిసెంబర్‌లో సోమవారం రాత్రి భోపాల్‌లో 3.3°C వద్ద అత్యంత చలిగా ఉంది. అంతకుముందు 1971లో ఉష్ణోగ్రత 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
రాజస్థాన్‌లోని షెఖావతికి చెందిన ఫతేపూర్ లో ఉష్ణోగ్రతలు మైనస్ లోనే కొనసాగొచ్చని భావిస్తున్నారు. సోమవారం ఫతేపూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత -1.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
జమ్మూ కాశ్మీర్‌లో హిమపాతం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలిగాలులు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం శ్రీనగర్‌లో పాదరసం మైనస్ 4° వద్ద నమోదైంది, దీని కారణంగా అనేక చోట్ల ఫౌంటైన్‌లలో నీరు గడ్డకట్టడం ప్రారంభించింది. చెట్లు,మొక్కలపై కూడా మంచు పేరుకుపోయింది.
ఇది కూడా చదవండి: TTD: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. అర్జితసేవ టికెట్లు విడుదలకానున్నాయి..
Cold Weather: హర్యానాలోని హిసార్‌లో టెంపరేచర్ 0.6º వద్ద ఉంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కాలుష్యం- చలి కారణంగా 5వ తరగతి వరకు పాఠశాలలు మూసివేశారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో గత 8 రోజుల్లో దాదాపు ఒక అడుగు మంచు కురిసింది. ఆ ప్రాంతమంతా తెల్లగా మారిపోయింది. ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం కూడా మంచుతో అలంకరించినట్టు ఉంది. ఇక రాబోయే రోజుల్లో డిసెంబర్ 22 తర్వాత మొత్తం హిమాలయాల్లో భారీ హిమపాతం ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
డిసెంబరులో నాలుగోసారి ఢిల్లీలో ఉష్ణోగ్రత 5.0º కంటే తక్కువగా పడిపోయింది. సోమవారం 4.5 డిగ్రీలుగా నమోదైంది. మహారాష్ట్ర, తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే ఈ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో చలిగాలుల ప్రభావం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుముఖం పడతాయి.
Cold Weather: రాబోయే 2 రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది?
ఇది కూడా చదవండి: Telangana Assembly Sessions Live: మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
డిసెంబర్ 18: 5 రాష్ట్రాల్లో వర్షం, రాజస్థాన్‌లో కోల్డ్ వేవ్స్ హెచ్చరిక
- తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళలో పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు చలిగాలులు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదల ఉండదు.
- ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చలి పెరగవచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రతలో తగ్గుదల ఉండవచ్చు.
డిసెంబర్ 19: ఎంపీలో చలి తీవ్రత కొనసాగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాకాలం కొనసాగుతుంది.
- తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళలో పిడుగులతో పాటు 7 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది.
- రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో చలిగాలులు వీస్తాయి.
- దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

