Amaravati: కేంద్రానికి సీఎం బాబు థాంక్స్..

Amaravati : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక మైలురాయి చేరుకుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి కొత్త ఇస్తుందని పేర్కొన్నారు.

వివరాల ప్రకారం, దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థ అపాక్ట్ కంపెనీ లిమిటెడ్ ఈ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనుంది. ఇందుకోసం రూ. 468 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్లాంట్‌లో మొబైల్ ఫోన్లు, సెట్-టాప్ బాక్సులు, ఆటోమోటివ్ ఈసీయూలు, గృహ వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరమైన సెమీ కండక్టర్ చిప్స్ ఉత్పత్తి చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ యూనిట్‌ను రాష్ట్రానికి కేటాయించడంపై సీఎం చంద్రబాబు, కేంద్ర ఐటీ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి ఈ పరిశ్రమను మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ యూనిట్ రాకతో సాంకేతిక నైపుణ్యం పెరగడమే కాకుండా స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jagityala Cime: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *