Hydra Police Station

Hydra Police Station: 250 మందితో హైడ్రా పోలీస్ స్టేషన్.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Hydra Police Station: హైదరాబాద్ నగరానికి మరో కీలక రక్షణ వేదిక సిద్ధమవుతోంది. హైడ్రా పోలీస్ స్టేషన్, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు మే 8న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ స్టేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించనున్నారు. బుద్ధ భవన్ సమీపంలోని హైడ్రో ప్రధాన కార్యాలయం పక్కనే నిర్మించిన ఈ ఆధునిక పోలీస్ స్టేషన్ రవాణా, అత్యవసర సేవలకు మరింత బలాన్ని చేకూర్చనుంది.

ఈ స్టేషన్‌లో ఒక ACP, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, అలాగే 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నారు. దీనికి తోడు, మినీ లారీలు, మోటార్ సైకిళ్లు, కార్లు, టిప్పర్లు వంటి 70కు పైగా వాహనాలు కూడా ఈ స్థావరంలో అందుబాటులో ఉంటాయి.

ఇది కూడా చదవండి: Operation Sindoor: పాకిస్తాన్ పై మెరుపు దాడి.. 30 మంది ఉగ్రవాదులు మృతి

మరోవైపు, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో తృటిలో మిస్ అయిన దాదాపు 150 మందికి HYDRAA నుండి అవకాశం లభించింది. వీరిని ట్రాఫిక్ విభాగంలో, అలాగే DRF బృందాల్లో నియమించనున్నారు. ఇది ఒకవైపు ఉద్యోగ అవకాశాలను పెంచుతుండగా, మరోవైపు నగర రక్షణ వ్యవస్థకు కావలసిన శక్తిని అందిస్తోంది.

పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రాంగణంలో తుది మెరుగులు పనిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు హాజరుకానున్నారు.

ఇది నగర పోలీస్ వ్యవస్థలో ఒక కీలకమైన మైలురాయి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *