CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంతూరు అయిన కొండారెడ్డిపల్లి మీదుగా రైల్వే నిర్మాణానికి కదలిక వచ్చింది. ఇప్పటికే తమ ఊరి మీదుగా రైల్వే నిర్మాణం చేపట్టాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తొలుత సర్వే చేసిన రైల్వేశాఖ 100 కిలోమీటర్ల దూరం కోసం, రూ.2,000 కోట్ల అంచనాలు రూపొందించింది.
CM Revanth Reddy: కల్వకుర్తి నుంచి కొండారెడ్డిపల్లి మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల వరకు రైల్వే నిర్మాణానికి తాజాగా ఎలైన్మెంట్ సర్వే జరిగింది. ఈ సర్వేలో రూ.126 కిలోమీటర్ల మేరకు రూ.2,520 కోట్ల అంచనాలు రూపొందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నూతన మార్గంలో రైల్వే అనుసంధానత కోసం ప్రతిపాదనలు తయారు చేశారు. తాజాగా లొకేషన్ తుది సర్వేకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే విభాగం లేఖ రాసింది.