Revanth Reddy: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు, ఐటీ ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్వేర్ నిపుణులకు ఎంతోకాలంగా ఎదురవుతున్న వీసా ఇబ్బందులకు పరిష్కారం దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ (Sergio Gor) తో బుధవారం (ఆగస్టు 5) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న వీసా స్లాట్ల కొరత, జాప్యం వంటి అంశాలపై ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు.
టెక్కీలు, విద్యార్థుల కష్టాలపై సీఎం ఫోకస్!
-
స్లాట్ల పెంపు & వేగవంతమైన పరిశీలన: వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచడంతో పాటు దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కోరారు.
-
ముందస్తు సమాచారం: వీసా నిబంధనలలో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే దరఖాస్తుదారులకు ముందుగానే అధికారిక సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
-
స్టూడెంట్ వీసాలు: తెలంగాణ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య దృష్ట్యా విద్యా వీసాల (Student Visas) కేటాయింపును పెంచాలని మరియు అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.
అమెరికాలో అత్యంత వేగంగా పెరుగుతున్న భాష తెలుగు!

అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ భాషలలో తెలుగు ఒకటి. తెలంగాణ-అమెరికా మధ్య విద్య, పెట్టుబడులు, సాంకేతిక రంగాలలో సహకారానికి పూర్తిస్థాయి మద్దతు ఇస్తామని రాయబారి గోర్ హామీ ఇచ్చారు.— సీఎం రేవంత్ రెడ్డి (‘X’ పోస్ట్ ద్వారా)
తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం!
విద్యార్థులు, టెక్కీల సమస్యలపై నేరుగా కేంద్రస్థాయిలో స్పందించిన సీఎం చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
