CM Revanth: కైరో (ఈజిప్ట్) వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో హైదరాబాద్‌కు చెందిన యువ షూటర్ ఈషా సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన ఈషా సింగ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.
Also Read: i-Bomma: బిగ్ బ్రేకింగ్ : ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్!
ఈషా సింగ్ ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శించిన అద్భుతమైన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణమని సీఎం కొనియాడారు. ఆమె పట్టుదలతో చేస్తున్న సాధన, కృషి ఎంతోమంది యువ క్రీడాకారులకు ముఖ్యంగా షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఈషా సింగ్ మరిన్ని అంతర్జాతీయ వేదికలపై రాణించి, దేశానికి మరెన్నో పతకాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

