Revanth Reddy: 10 నెలల్లో తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ప్రజలకు తెలిసొచ్చిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. డీఎస్సీతో ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు’ అని తెలిపారు.
Revanth Reddy: ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని తాము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి దొంగలను చూశాం కానీ అసెంబ్లీకి రాని వారిని ఇప్పుడే చూస్తున్నాం అని సెటైర్ వేశారు. శాసనసభకు వచ్చి సమస్యలపై చర్చించడం ప్రతిపక్ష నేత బాధ్యత అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కూడా కట్టలేదు కానీ ఆయన మాత్రం 10 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నారని రేవంత్ విమర్శించారు.
Revanth Reddy: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 కూడా నిర్వహించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 2011లో చివరిసారిగా గ్రూప్-1 నిర్వహించారని, దాదాపు 13 ఏళ్ల పాటు పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపానని, ఎంపికైన వారికి త్వరలో నియామకపత్రాలు అందిస్తానని పేర్కొన్నారు.