CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులు, ఇతర ముఖ్య అధికారులతో ఈ రోజు (అక్టోబర్ 11) అత్యవసర సమావేశం కానున్నారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ తాజాగా అందింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో9పై హైకోర్టు స్టే ఇచ్చింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఆలోపు రిజర్వేషన్లతో ఎన్నికలు జరుపుకోవచ్చని ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
CM Revanth Reddy: ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో న్యాయవాదులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలు, హైకోర్టు తీర్పుపై వారు చర్చించనున్నట్టు తెలిసింది. ఇవే అంశాలపై అతి త్వరలో క్యాబినెట్ సమావేశం కూడా ఉంటుందని తెలుస్తున్నది.