TG News

TG News: కేసులు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం రేవంత్ కేటీర్ పిటిషన్‌లు

TG News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన వేర్వేరు కేసులపై హైకోర్టు ముందుకు వెళ్లారు. ఈ రెండు కేసులు ప్రస్తుతం సంబంధిత కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణ తేదీలను వాయిదా వేసింది.

రేవంత్ రెడ్డి కేసు వివరాలు

2021లో ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం హాజరు నుంచి రేవంత్ రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Kaleshwaram Project: జీవో విడుదల..కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్

కేటీఆర్ పిటిషన్ వివరాలు

బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసు రద్దు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సృజన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కౌంటర్ సమర్పించమని ఆదేశించి, విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prabhakar Rao: హైదరాబాద్‌ చేరుకున్న ప్రభాకర్‌ రావు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *