Cm revanth: జూబ్లీహిల్స్ ఉపయోగ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు “ఈ ఎన్నికలు సెంటిమెంట్ మీదనా? డెవలప్‌మెంట్ మీదనా? ఒక్కసారి ఆలోచించండి. గతంలో పీజేఆర్ కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేయాలంటే కేసీఆర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం బీఆర్‌ఎస్ నేతలు సెంటిమెంట్ పేరిట ఓట్లు అడుగుతున్నారు. బెంజ్ కార్లు వదిలేసి ఆటోల్లో తిరుగుతూ ప్రజలను భావోద్వేగానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉంటే ముందుగా పీజేఆర్ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలి. ఎవరు అడగకపోయినా జూబ్లీహిల్స్‌కు రూ.400 కోట్ల నిధులు కేటాయించాం. ఇక త్వరలోనే ఈ నియోజకవర్గంలో 4 వేల ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటాం.

