Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్న పరువు నష్టం కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించినది. ఆయన మాట్లాడుతూ “బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది” అనే వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసు విచారణలో కోర్టు ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసింది. అంతేకాక, రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్స్‌ను పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
ఈ నేపథ్యంలో, కేసును కొట్టివేయాలని, అలాగే నాంపల్లి కోర్టు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని, విచారణకు హాజరయ్యే నుండి మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ రేపు హైకోర్టులో జరగనుంది.