Cm revanth: యాదాద్రిని మళ్ళీ యాదగిరిగుట్టగా ఎందుకు మార్చామంటే..?

Cm revanth: యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన తెలిపారు.

యాదగిరిగుట్ట పేరుపై స్పష్టత:

గతంలో యాదగిరిగుట్ట పేరు ‘యాదాద్రి’గా మార్చారని గుర్తు చేస్తూ, ప్రజల ఆకాంక్ష మేరకు మళ్లీ యాదగిరిగుట్టగా మార్చామని తెలిపారు.

భక్తుల కోరికలకు అనుగుణంగా ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

యాదగిరిగుట్టలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఆ ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

గంధమల్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం ఎందుకు పూర్తిచేయలేకపోయిందో ప్రశ్నించారు.

మూసీ నది ప్రక్షాళనపై దృష్టి:

తన పుట్టిన రోజు అయినా కూడా మూసీ ప్రాంత ప్రజల కష్టాలు చూసేందుకు వచ్చానని చెప్పారు.

మూసీ నది ప్రక్షాళన చేయడం తాము అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పామన్నారు.

గుజరాత్‌లో సబర్మతి, ఉత్తరప్రదేశ్‌లో యమునా నదుల అభివృద్ధి జరిగినట్లు గుర్తు చేస్తూ, తెలంగాణలో మూసీ అభివృద్ధి ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.

గోదావరి జలాలతో మూసీ నదిని శుద్ధి చేస్తామని తెలిపారు.

“ఎర్రవల్లి, మొయినాబాద్, జన్వాడ ఫామ్‌హౌస్‌లు లాక్కుంటామని మేం అనడం లేదు. ప్రజల ప్రయోజనార్థమే తాము పనిచేస్తామన్నది మా ఉద్దేశ్యం” అని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు:

గత పదేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎందుకు ప్రాజెక్టులు పూర్తికాలేదో అడిగారు.

మూసీ నది ప్రాంత ప్రజల బాధలు బీఆర్ఎస్, బీజేపీకి కనిపించవా? అని విమర్శించారు.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *