Cm revanth: నల్గొండ జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ భూమి పోరాట యోధులను, పౌరుషం కలిగిన నాయకులను అందించిన పవిత్ర గడ్డగా కొనియాడారు. ఇదే వేదికపై ఆయన BRS పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నీటి సమస్యకు పరిష్కారం
నల్గొండ జిల్లాలో సాగునీరు, త్రాగునీటి సౌకర్యాలు మెరుగుపడటానికి కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే కారణమని సీఎం స్పష్టం చేశారు. BRS ప్రభుత్వ హయాంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
స్థానిక నాయకుడిపై విమర్శలు
ప్రత్యక్షంగా ఎవరిని పేరుపెట్టకపోయినా, “మూడు అడుగుల నాయకుడు ఎగిరి ఎగిరి పడుతున్నాడు” అంటూ స్థానిక BRS నాయకుడిపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
BRS పదేళ్ల పాలనపై ఆరోపణలు
BRS ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. పేదలకు ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంటే ఓర్వలేక BRS నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.
రుణమాఫీ, రైతు భరోసా అమలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీను అమలు చేశామని తెలిపారు. రైతు భరోసా వాయిదా వేస్తామనే అపప్రచారం చేసినా, ప్రభుత్వం ఏర్పాటుైన తొలికొద్దిరోజుల్లోనే రైతులకు నిధులు జమ చేశామని వెల్లడించారు.
తెలంగాణ వరిధాన్యంలో దేశంలో నెంబర్ వన్
రాష్ట్రంలో రైతుల కష్టానికి ఫలితంగా తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది రైతుల విజయమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని, ప్రతి రైతుకు, ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.