AP News: పవిత్రమైన తిరుమల క్షేత్రానికి నిషేదిత వస్తువులైన సిగరేట్లు, బీడీలు, ఖైనీలు, హాన్స్ వంటి పొగాకు ఉత్పత్తులు చేరాయి. తిరుమలకు నడిచివచ్చిన మార్గాన్ని అభివృద్ధి చేయాలనే నినాదంతో కొన్నేళ్లుగా వైసీపీ నేత, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరాడు..
ఇందులో భాగంగా కడప, రాయచోటి, కోడూరు పరిసర ప్రాంతాల్లోని దాదాపు మూడు వేల మంది భక్తులతో ఆయన పాదయాత్రగా తిరుమలకు చేరుకున్నారు. అయితే, పాదయాత్ర బృందంలో వచ్చిన కొంతమంది సిగరేట్లు, బీడీలు, ఖైనీలు, హాన్స్ వంటి పొగాకు ఉత్పత్తులు కూడా తమతో తీసుకొచ్చారు. వీటిని చూసిన భక్తులు వారి చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP News: గోగర్భం డ్యాం వద్ద విజిలెన్స్ అధికారులు, సిబ్బంది తనిఖీల్లో వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వైసీపీ గుర్తులు, పేర్లు, జగన్‌మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఫొటోలతో కూడిన బ్యాగులకను తిరుమలకు తీసుకువచ్చారు. వీటిని గమనించిన మిగత భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.