Choutuppal: రూ.1,29,999 పలికిన OG టికెట్ ధర

Choutuppal: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన OG సినిమా బెనిఫిట్‌ షో టికెట్‌ వేలంపాటలో రికార్డ్‌ స్థాయికి చేరింది. వేలంలో ఒక టికెట్‌ రూ.1,29,999 పలికింది.

ఈ టికెట్‌ను పవన్‌ అభిమానులలో ఒకరైన ఆముదాల పరమేష్‌ దక్కించుకున్నారు. టికెట్‌కు చెల్లించిన మొత్తం మొత్తాన్ని జనసేన పార్టీ ఆఫీసుకు అందజేస్తానని ఆయన ప్రకటించారు.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ OG ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. అభిమానుల్లో ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *