Vishwambhara

Vishwambhara: కీరవాణి పని తీరుపై చిరు అసంతృప్తి!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గీ ‘విశ్వంభర’ సినిమా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే, గతంలో ప్రకటించిన రిలీజ్ డేట్‌లో మార్పులు జరిగాయి. ఈ ఆలస్యానికి కారణం ఏంటనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘విశ్వంభర’లో ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఈ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఓ ట్రాక్ రెడీ చేశారు. కానీ, ఈ ట్యూన్ చిరంజీవికి పూర్తిగా నచ్చలేదని, అందుకే కీరవాణి దాన్ని మళ్లీ కంపోజ్ చేసే పనిలో ఉన్నారని టాక్.

ఈ ట్రాక్ ఫైనల్ అయిన వెంటనే సాంగ్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరుతో కలిసి ఎవరు స్టెప్పులేస్తారనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీని జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీమ్ సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా, ‘విశ్వంభర’ సినిమా మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను థ్రిల్ చేయడానికి రెడీ అవుతోంది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Israil: ఇజ్రాయెల్‌పై హౌతీ దళాల క్షిపణి దాడి – 8 మందికి తీవ్రగాయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *