Mana Shankara Varaprasad Garu

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ కొత్త పాటతో మళ్లీ సందడి!

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా నుంచి రెండో పాట రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ పాట ప్రోమో డిసెంబర్ 6న వస్తుంది. ఫుల్ లిరికల్ వీడియో డిసెంబర్ 8న రిలీజ్ అవుతుంది. భీంస్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Also Read: Rashmika: రష్మిక-విజయ్ దేవరకొండ ఫిబ్రవరిలో పెళ్లి? రూమర్స్ పై రష్మిక స్పందన

కొత్తగా విడుదలైన పోస్టర్‌లో చిరంజీవి ఎరుపు-తెలుపు ప్రింటెడ్ షర్ట్, తెల్లని ప్యాంట్‌లో కనిపిస్తూ అదిరిపోతున్నారు. నయనతార పాస్టల్ బ్లూ షర్ట్, ఆరంజ్ ప్యాంట్‌లో స్టైలిష్ లుక్‌లో కనువిందు చేస్తోంది. ఇద్దరి ముఖాల్లోని ఆనందం, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న సముద్రం, ఓడలు ఈ పాట ఓ బ్రీజీ రొమాంటిక్ నంబర్ అని స్పష్టం చేస్తున్నాయి. మొదటి సింగిల్ ‘మీసాల పిల్ల’ రికార్డులు బద్దలు కొడుతున్న నేపథ్యంలో ఈ ‘శశిరేఖ’ పాటపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సహూ గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం, విక్టరీ వెంకటేష్‌ – చిరంజీవి కాంబినేషన్‌ను తెరపై తెచ్చిన మొదటి సినిమా కావడం విశేషం. సంక్రాంతి 2026కి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మెగా ఎంటర్‌టైనర్ ఇప్పటికే టాక్ ఆఫ్ టాలీవుడ్ అయిపోయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *