Prabhu Deva: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా తన డ్యాన్స్ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో అతిథిగా పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులను, సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ప్రభుదేవా మాట్లాడుతూ, తన డ్యాన్స్ టాలెంట్‌ను గుర్తించి, ప్రోత్సహించడంలో చిరంజీవిగారే ముందున్నారని గుర్తు చేసుకున్నారు. “నాకు హిప్-హాప్, బ్రేక్ డ్యాన్స్‌లు లాంటివి ఏమీ తెలియదు. నాకు తెలిసింది నా సొంత శైలి డ్యాన్స్ మాత్రమే. దాన్నే ప్రేక్షకులకు అందిస్తున్నాను” అని ప్రభుదేవా తెలిపారు.
Also Read: Ahaan Panday: అహాన్ పాండే: కొత్త సినిమాతో సంచలనం!
తన కెరీర్‌లో చిరంజీవి స్ఫూర్తి గురించి వివరిస్తూ, “సినిమా పరిశ్రమ ఎంతో మందికి అవకాశాలు ఇస్తుంది, కానీ నిలదొక్కుకోవడం కష్టం. ఆ విషయంలో నాకు ఇండస్ట్రీలో చిరంజీవిగారు ఆదర్శం. ఆయన కష్టపడే తీరును నేను కళ్లారా చూశాను,” అని ప్రభుదేవా అన్నారు. ముఖ్యంగా, ‘అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు’ సినిమాలో “మెరుపులా” పాటకి తానె కొరియోగ్రఫీ చేశానని, అప్పుడు ఆయన డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయానని గుర్తు చేసుకున్నారు. “నేడు నాకు ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా ఇంత గుర్తింపు రావడానికి కారణం చిరంజీవిగారే. టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు,” అని కొనియాడారు. ప్రభుదేవా 15 ఏళ్ల వయసులోనే ‘అబ్బనీ తీయని దెబ్బ’ పాట కొరియోగ్రఫీలో తన తండ్రితో కలిసి పని చేశానని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుదేవా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.