Mana Shankara Varaprasad Garu

Mana Shankara Varaprasad Garu: తుది దశకు ‘మన శంకర వరప్రసాద్ గారు’!

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ అప్పుడే తుది దశకు చేరుకుంది.క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Ilaiyaraaja: 15 ఏళ్లలోపు చిన్నారులకు ఇళయరాజా గోల్డెన్ ఛాన్స్?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రానుంది. వెంకటేష్ మరో కీ రోల్ పోషిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఆదివారం నుంచి హైదరాబాద్‌లో క్లైమాక్స్ యాక్షన్ షూటింగ్ జరుపుకుంటుంది. చిరంజీవితో పాటు ఫైటర్స్ బృందం పాల్గొన్న ఈ భారీ సీక్వెన్స్‌కు వెంకట్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్లైమాక్స్ ప్రేక్షకులకు కచ్చితంగా మరచిపోలేని అనుభూతి అందిస్తుందని టీమ్ ధీమాగా ఉంది. సాహు గారపాటి, చిరు కుమార్తె సుస్మిత ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అభిమానులను పూర్తిగా ఆకట్టుకునే అవకాశం ఉంది. కామెడీ, యాక్షన్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *