Chirag Chikkara: అల్బేనియాలో జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో చిరాగ్ చిక్కారా స్వర్ణంతో మెరిశాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో సత్తా చాటాడు.. ఫైనల్లో కిర్గిస్థాన్ కు చెందిన అబ్దిమాలిక్ కరాచోవ్ పై 4-3 తేడాతో గెలిచి పసిడి పతకం ఒడిసి పట్టాడు. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో ఒజావాను 6-1తో.. క్వార్టర్స్‌లో లునాస్‌ను 12-2తో ఓడించిన చిరాగ్.. సెమీస్‌లో 8-0తో అలన్ ఒరెల్‌బెక్‌ను చిత్తు చేశాడు. అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమన్ సెహ్రావత్ తర్వాత స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్ చిరాగే కావడం విశేషం. 2022లో అమన్ ఈ ఘనత సాధించాడు. కాగా, ఈ టోర్నీలో 97 కేజీల విభాగంలో విక్కీ, 70 కేజీల విభాగంలో సుజీత్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
WE HAVE A NEW WRESTLING WORLD CHAMPION.🌎🏆
Chirag Chikkara wins GOLD in the U23 World Wrestling Championships! 🇮🇳
He beats Kyrgyzstan’s Abdymalik Karachov in Men’s 57kg Final!🥇
Chirag becomes the 2nd Indian male wrestler to win the U23 World Title after Olympic Medallist… pic.twitter.com/moEQDGt8Eh
— Sportskeeda (@Sportskeeda) October 27, 2024