Child marriage: ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా.. స్వచ్ఛంద సంస్థలు చైతన్యవంతమైన కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నా.. బాల్య వివాహాలు జరుగుతూనే ఉండటం విస్మయం కలిగించక మానదు. ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. చట్టాలు, కేసులు ఉన్నాయన్న విషయం తెలిసి కూడా కొందరు ఇలాంటి నిర్వాకానికి పాల్పడుతూనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరగడం విస్మయానికి కలిగిస్తున్నది.
Child marriage: రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో భర్త చనిపోవడంతో ఓ మహిళ తన కూతురు, కొడుకుతో కూలిపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన 8వ తరగతి చదువుతున్న తన కూతురికి వివాహం చేద్దామని నిర్ణయించుకున్నదా? వివాహాలు చేసే మధ్యవర్తి చెప్పాడో కానీ, ఆ బాలిక పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నది. కానీ, తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని ఆ 8వ తరగతి చదివే బాలిక తేల్చి చెప్పింది.
Child marriage: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కాందవాడ గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి బాగా ఆస్తి ఉన్నదని ఆ మధ్యవర్తి 8వ తరగతి చదివే బాలికకు ఇష్టంలేకపోయినా సంబంధం కుదిర్చారు. తనకు పెళ్లి వద్దని ఆ 13 ఏళ్ల వయసున్న బాలిక ఎంతగా మొత్తుకున్నా వినకుండా మే నెల 28న వారిద్దరికీ వివాహం జరిపించారు. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని, తాను చదువుకుంటానని ఆ బాలిక ఇప్పటివరకూ మదన పడుతూనే ఉన్నది.
Child marriage: ఈ విషయం తెలిసిన ఆ బాలిక చదివే పాఠశాల ప్రిన్సిపాల్ ఆ బాలికను ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి జరిగిన విషయం వివరించారు. ఆ తహసీల్దార్, బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ బాలిక తల్లి, 40 ఏళ్ల వ్యక్తి, మధ్యవర్తి, పెళ్లి జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను పోలీసులు రెస్క్యూహోంకు తరలించారు.