Telangana:ఎన్నిచట్టాలు తెస్తున్నా.. ఎంతగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా.. కొంతమందిలో ఇంకా మార్పు అనేది రావడం లేదు. బాల్య వివాహాలకు ముగింపు పలకడం లేదు. తమకున్న పరిధిలోనే జీవిస్తూ పాత పద్ధతులు పాటిస్తూ వస్తున్నారు. బాలికల మైనార్టీ తీరకుండానే పెళ్లీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ వారి జీవితాలు ఎంతగా దుర్భరమవుతాయే గమనించడం లేదు. ఈ కోవలోనే తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ బాల్యవివాహం వెలుగుచూసింది.
Telangana:కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పదో తరగతి చదువుతున్న బాలికకు 24 ఏండ్ల యువకుడికి ఇచ్చి తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అర్ధరాత్రి పెళ్లి జరుగుతున్నట్టు సమాచారం అందగానే సీడబ్ల్యూసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే వివాహ తంతు ముగిసింది. ఈ లోగా ఇతర కార్యక్రమాలను అధికారులు అడ్డుకున్నారు.
Telangana:ఈ బాల్యవివాహంపై పోలీస్‌స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. బాలిక, యువకుడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాలికను బాలసదన్‌కు తరలించారు. అయితే మరో విషయం అనుమానాస్పదంగా మారింది. పెళ్లయిన ఆ బాలిక గర్భవతి అన్నట్టుగా అనుమానం ఉన్న అధికారులు, వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించుకున్నారు.