Chevi Reddy

Chevi Reddy: చెవి రెడ్డి అవినీతి

Chevi Reddy: బోరుగడ్డ, పోసాని… వీళ్లలా నోటితో చేసిన తప్పులకు అరెస్టులు ఉంటున్నాయ్‌ కానీ… వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు రెండు చేతులా అవినీతికి పాల్పడిన నేతలకు శిక్షలు ఇంకెప్పుడు అన్న అసహనం పెరిగిపోతోంది సాక్షాత్తూ అధికార పార్టీ నేతల్లోనే. అందుకు నిదర్శనమే మొన్న అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని లేవనెత్తిన అంశం. చంద్రగిరి నియోజకవర్గంలో గత పాలకుడి దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ప్రస్తావిస్తూ.. ఆన్‌ రికార్డ్‌ సభ ముందు ఉంచారు ఎమ్మెల్యే పులివర్తి నాని. ఎన్ని అక్రమాలు, ఎన్ని అవినీతి కార్యక్రమాలు? అన్నీ కళ్ల ముందు కనబడుతున్నా చర్యలెందుకు ఉండటం లేదు? ఇకనైనా కళ్లు తెరవకపోతే కూటమికి కష్టాలేనా? లెట్స్‌ వాచ్ దిస్‌ స్టోరీ.

వైసీపీ ఐదేళ్ల పాలనలో చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్పడిన దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను అసెంబ్లీలో ప్రస్తావించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తుడా నిధులు దుర్వినియోగంపైనా అసెంబ్లీలో గలమెత్తారు. 7 నియోజకవర్గాల పరిధిలో ఉండే తుడాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన జేబు సంస్థగా మార్చుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని అసెంబ్లీలో ప్రస్తావించారు ఎమ్మెల్యే నాని. తుడాలో జరిగిన అవినీతి.. దేశంలో కూడా ఎక్కడా జరిగి ఉండదని అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. తను సొంతంగా నియమించుకున్న 65 మంది స్టాఫ్‌కి ప్రతి నెలా లక్షలాది రూపాయలు జీతాలు చెల్లించింది కూడా తుడా నిధుల నుండేనని బాంబు పేల్చారు. విశ్రాంత రెవెన్యూ అధికారుల ద్వారా నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఎలా జాబితాలోకి ఎక్కించారో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. దొంగ ఓట్లపై తన కుటుంబ సభ్యులు ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తు చేస్తూనే.. అలా దొంగ ఓట్లు ఎక్కించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యోగస్తులు మాత్రం ఇప్పటికీ అదే ఉద్యోగంలో కొనసాగుతూనే ఉన్నారన్న దారుణమైన నిజాన్ని అసెంబ్లీ వేదికగా నిక్కచ్చిగా చెప్పేశారు పులివర్తి నాని.

Chevi Reddy: చంద్రగిరిలో చెవిరెడ్డి అక్రమాలపై, అన్యాయాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు లేవన్నది పులివర్తి నాని ఆవేదనగా కనిపించింది అసెంబ్లీలో. తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి పేరుతోనూ అవినీతికి పాల్పడ్డారు. పార్కు అభివృద్ధి పేరుతో 88 ఎకరాల తుమ్మలగుంట చెరువు భూముల్ని స్వప్రయోజనాలకి వాడుకున్నారు. తుడా నిధులను దుర్వినియోగం చేస్తూ… కంప్యూటర్లు, సీసీ కెమెరాల పేర్లతో విచ్చలవిడిగా లక్షల రూపాయలు దోచేశారు. తుడా నిధులతో సింగపూర్, మలేషియా తదితర దేశాలకు తిరిగి, సుమారు 60 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు. తుడా నిధులు 246 కోట్లు ఎంపీడీవోలకు బదలాయించడం వెనకా భారీ అవినీతిని జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో మెడికల్ క్యాంపుల పేరుతో, లక్షా 55 వేల మందికి వైద్య పరీక్షల పేరుతో.. 10 కోట్ల పైచిలుకు నిధులు దుబారా చేశారు. ఇక్కడా తుడా ఖజానాకే చిల్లు పెట్టారు. అలా తుడాను చెవిరెడ్డి ఏటీఎంలా వాడుకున్నారనీ, దీనిపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేసినప్పటికీ స్పందన లేదని వాపోయారు ఎమ్మెల్యే పులివర్తి నాని.

Also Read: Janasena: పది లక్షల మందితో.. మొదలైన జనసేన సభ..

చెవిరెడ్డిపై ఎన్ని ఆరోపణలున్నా, ప్రాధమిక ఆధారాలతో సహా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆయన్ను టచ్‌ చేయలేకపోతున్నాయి విచారణ సంస్థలు. దీనికి కారణం గత ప్రభుత్వంలో పని చేసిన ఉద్యోగస్తులు ఇప్పటికీ కొనసాగుతూ ఉండటమేనని, అందువల్లే విచారణలో జాప్యం కొనసాగుతూనే ఉందనీ, ఇప్పటికైనా సంబంధిత శాఖల వారు చర్యలు తీసుకోవాలని కూడా అసెంబ్లీ సాక్షిగా కోరారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. టీడీపీలో ఈ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే ఎవ్వరికైనా ఆశ్యర్యం వేయక మానదు. ఎందుకంటే గత ఐదేళ్లు చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డిపై ఆయన చేసిన పోరాటాలు అటువంటివి. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది. నేటికీ ఎమ్మెల్యే పులివర్తి నానికి చెవిరెడ్డిపై పోరాటాలతోనే సరిపోతోంది. చంద్రగిరి ప్రజలు కేవలం కూటమికి అనుకూలంగా ఓట్లు వేయలేదు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అండ్ కో అవినీతికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇది గ్రహించైనా కూటమి ప్రభుత్వం చెవిరెడ్డిపై చర్యలు స్పీడప్‌ చేయాలని ఒక్క చంద్రగిరిలోనే కాదు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. చూడాలి మరి. చంద్రగిరి ఎపిసోడ్‌కి ఎప్పటికి ఎండ్‌ కార్డు పడేనో!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *