Chevella Bus Accidetnt: హైదరాబాద్-బీజాపూర్ హైవే విస్తరణ పనుల్లో ఎందుకు ఆలస్యం జరిగింది? ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎందుకు ఎక్కించారు? బస్సుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు? అని చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ గేట్ వద్ద ఇటీవల జరిగిన బస్సు ప్రమాద ఘటనపై విచారణకు దిగిన సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ.. ఎన్‌హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది.
Chevella Bus Accidetnt: ఇటీవల జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాద ఘటనపై విచారించేందుకు సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ హైదరాబాద్‌కు చేరుకున్నది. తొలుత ఎన్‌హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. ఘటనపై ఆరా తీసింది. అనుమానాలు, అభ్యంతరాలపై వారికి ప్రశ్నలు గుప్పించింది.
Chevella Bus Accidetnt: ఇన్ని రోజులు రహదారి విస్తరణ పనులను ఎందుకు చేపట్టలేదని, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు బస్సుల సంఖ్యను పెంచాలని తెలియదా? అని ఎన్‌హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ప్రమాదానికి గురైనది అద్దె బస్సు అని గుర్తించారు. అసలు అద్దె బస్సులు ఎన్ని ఉన్నాయి. అందులో రాజకీయ నాయకులవి ఎన్ని ఉన్నాయని కమిటీ సభ్యులు నిలదీశారు.
Chevella Bus Accidetnt: ఇప్పటికైనా ప్రధాన హైవే విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు సూచించారు. భారీ వాహనాలు అధిక లోడుతో వెళ్లకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, వాహనాలు, డ్రైవర్ల ఫిట్‌నెస్ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను కమిటీ ఆదేశించింది.

