Buckwheat: మన సాంప్రదాయ ఆహారంలో బుక్వీట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బుక్వీట్ అంటే పండ్ల గింజలు. ఇవి నాలుకకు రుచిని జోడించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఎందుకంటే ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఆమైనో ఆమ్లాలతోపాటు ఫైపర్ యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి బుక్వీట్ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది
సాధారణంగా బుక్వీట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి, మీరు తరచుగా అజీర్ణంతో బాధపడుతుంటే, ప్రతిరోజూ బుక్వీట్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుండి రిలీఫ్ పొందవచ్చు. ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీనిలోని ఫైబర్ కంటెంట్ శరీరానికి తక్షణ శక్తిని అందించి.. అలసట నుండి దూరంగా ఉంచుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బుక్వీట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే లక్షణాలను కూడా కలిగి ఉంది. ఈ లక్షణాల కారణంగా, మధుమేహం ఉన్నవారు ఈ చిక్కుళ్ళను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
రక్తహీనత సమస్యలను తగ్గించడంలో బుక్వీట్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారు ఈ ధాన్యాన్ని తినడం ద్వారా వారి హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించి.. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
బుక్వీట్ లోని ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. అదనంగా, దీనిని సూప్ లేదా ఇన్ఫ్యూషన్ రూపంలో తాగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జుట్టు పోషణకు మంచిది
బుక్వీట్ చర్మ ఆరోగ్యానికి, జుట్టు పోషణకు చాలా మంచిది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలను తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి. దీంతో, శరీరం రోజంతా చురుకుగా ఉంటుంది.