Tollywood: టాలీవుడ్ సినిమాల రీచ్ బాగా పెరిగిపోయింది. దానికి తగ్గట్లుగానే ఖర్చు కూడా రెండింతలు అయింది. నిర్మాతలకు తమ తమ సినిమాల బడ్జెట్ పై నియంత్రణ లేకుండా పోయింది. సినిమా నిర్మాణంలో 60 నుంచి 70 శాతం వ్యయం నటీనటలు, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే పోతుంది. ప్రత్యేకించి 40 నుంచి 50 శాతం వరకూ హీరో రెమ్యూనరేషన్ ఉంటోంది. అంతే కాదు హీరోల వ్యక్తిగత ఖర్చుల భారం కూడా నిర్మాతలపైనే పడుతోంది. అందులో హీరోల ప్రైవేట్ ఫ్లైట్స్ ఖర్చుకూడా ఉంటోంది. షూటింగ్ కోసం కానీ, ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం కానీ స్టార్స్ ఎవరూ దేశీయ విమానాల్లో ప్రయాణించటం లేదు. చార్టర్డ్ ఫ్లైట్స్ లో ప్రయాణించటానికే ఇష్టపడుతున్నారు.
Tollywood: వీటికి రోజుకు 5 నుంచి 10 లక్షల ఖర్చు అవుతుంది. ఇవే కాకుండా హీరోల సెక్యూరిటీ భారం కూడా నిర్మాతలపైనే పడుతోంది. ఏ నిర్మాతకీ నో అనే ధైర్యం లేదు. ప్రతి స్టార్ హీరో షూట్ కోసం కానీ, ఈవెంట్స్ కోసం కానీ బేగంపేట ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి అక్కడ నుంచి ఛార్టర్డ్ ప్లైట్స్ లో వెళ్ళడం సర్వసాధారణం అయిపోయింది. ఈ కల్చర్ టాలీవుడ్ లో బాగా విస్తరించింది. అదేమంటే టైమ్ బాగా కలసి వస్తుందని నమ్మిస్తున్నారు. దీనికి పుల్ స్టాప్ పెట్టే ధైర్యం ఏ నిర్మాతకూ లేదు. స్టార్స్ లోనే రియలైజేషన్ రావాలి. మరి అది వస్తుందా? అంటే కనుచూపు మేరలో కనిపించటం లేదు. నిర్మాతలను కాపాడేది ఎవరో!?