Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్‌తో సినిమా వాయిదా పడటంతో, త్రివిక్రమ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రం త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఆసక్తికరంగా, ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ, సుకుమార్ సినిమాకు ముందు త్రివిక్రమ్‌తో ఈ మల్టీస్టారర్‌లో కనిపించనున్నారట. గతంలో వెంకీ, పవన్ కళ్యాణ్‌తో ‘గోపాల గోపాల’ చేసిన చరిత్ర ఉంది. ఈ క్రమంలో రామ్ చరణ్, వెంకటేష్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

