Chandrababu Naidu: ఏ పనికావాలన్నా.. ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు.. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలను అందుబాటులోకి తీసుకొస్తం.. మెరుగైన సాంకేతికతతో అద్భుతాలు సృష్టించే కాలం ఇది.. అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో బుధవారం జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు జరిగింది. ఈ సదస్సులో నాలుగు కీలక అంశాలపై చర్చ జరిగింది. యూఏఈకి చెందిన పారిశ్రామిక వేత్తలతో జరిగిన ఈ సదస్సునకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు.
దుబాయ్‌ను చూస్తే అసూయ వేస్తుంది..
Chandrababu Naidu: ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. ఈ సదస్సునకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరవడంతో చర్చలకు ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ దుబాయ్‌ను చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని అన్నారు. దుబాయ్‌లో ఎడారి ప్రాంతాలు, బీచ్‌లు, ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు.
వినూత్న ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు
Chandrababu Naidu: సంక్షోభాలనూ అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, వినూత్నంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. యూఏఈతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, యూఏఈ జనాభాలో 40 శాతం మంది భారతీయులే ఉన్నారని చెప్పారు. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరమని, ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశమే దుబాయ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు.
2047 నాటికి భారత్ సూపర్ పవర్
Chandrababu Naidu: 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్‌తో పరిస్థితి మారిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించారు. ప్రధాని మోదీ సారధ్యంలో భారత్‌కు మరిన్ని అవకాశాలు మెరుగయ్యాయని చెప్పారు. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
2026 జనవరి నాటికి క్వాంటం రెడీ
Chandrababu Naidu: ఉమ్మడి ఏపీలోనే తాను విజన్-2020 రూపొందించానని, ఆ విజన్‌తో రాష్ట్రాభివృద్ధిని మెరుగుపర్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ స్థాపనే మా లక్ష్యం
Chandrababu Naidu: ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ స్థాపనే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల వంటి అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా పీ4 తీసుకొస్తున్నామని, పబ్లిక్, ప్రైవేటు, పీపుల్, పార్టనర్‌షిప్ తెస్తామని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు మాల్ ప్రతినిధులు ముందుకొచ్చారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దావోస్‌లో లులు మాల్ ప్రతినిధులను నాలుగైదు సార్లు కలిశామని తెలిపారు. లులు మాల్ అంతర్జాతీయంగా రిటైల్ కేంద్రాలను నిర్వహిస్తున్నదని తెలిపారు.