Amaravati: అమరావతిలో 5 ఎకరాలు కొన్న చంద్రబాబు

Amaravati: సీఎం చంద్రబాబు ఇటీవల అమరావతి ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇది వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఉంది. అమరావతి నిర్మాణం పూర్తయ్యాక సొంతగృహం నిర్మించాలనుకుంటున్నట్లు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఈ స్థలం కొనుగోలు చేసి, భవిష్యత్తులో తన గృహ నిర్మాణానికి పునాది వేయాలని నిర్ణయించారు. ఈ ప్లాట్ కు చుట్టూ రహదారులు ఉన్నాయి, మరియు ఇది జడ్జిల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, ఎన్‌జీఓల రెసిడెన్సీలు వంటి కీలక ప్రదేశాలకు దగ్గరగా ఉంది.

ఇక, రాజధానికి కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా ఈ స్థలం సమీపం నుంచి వెళ్ళిపోతుంది.ఈ స్థలం, ముగ్గురు రైతుల పేరిట రిజిస్టర్ చేయబడి ఉంది, రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని సమాచారం. ఈ ప్లాట్‌లో ఒక భాగం ఇంటి కోసం, మిగిలిన భాగం వాహనాల పార్కింగ్, సిబ్బందికి గదులు, లాన్ వంటి అవసరాలకు ఉపయోగపడనుంది. గత పది సంవత్సరాలుగా, చంద్రబాబు కృష్ణా నది ఒడ్డున ఉన్న అతిథిగృహంలో ఉంటున్నారు. ఇప్పుడు, ఈ కొత్త స్థలం కొనుగోలుతో ఆయన అమరావతిలో తన సొంత ఇల్లు నిర్మించుకోవాలని నిర్ణయించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *