Chaild Marriage: తమిళనాడు రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకున్నది. తనకు పెళ్లి వద్దని ఎంతగా మొత్తుకున్నా వినని తల్లి దండ్రులు ఆమెకు పెళ్లి చేసేశారు. కాపురానికి వెళ్లనని మారాం చేస్తే ఏకంగా భుజాలపై ఎత్తుకెళ్లిన ఘోర దుర్ఘటన చోటుచేసుకున్నది. మారుతున్న ఈ సమాజంలో కూడా ఇలాంటి దారుణాలు జరగడం సభ్యసమాజం తలదించుకోవాల్సి వస్తున్నది.
Chaild Marriage: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాలు వద్దని ఎంతగా ప్రచారం చేస్తున్నా ఇంకా కొన్ని కుటుంబాలు ఈ సంకుచిత ఆలోచనల నుంచి బయటపడటం లేదు. అనారోగ్యాలు దరిచేరి ఎందరో యువతులు తనువులు చాలిస్తున్నా, జీవితాంతం జీవచ్ఛవాల్లా మారుతున్నా అలాంటివారు మారడం లేదు. ఇప్పటికీ కొన్ని కులాలు, జాతులను ఈ మూఢనమ్మకాల జాఢ్యం వదలడం లేదు. దీంతో వారు బాల్యంలోనే వివాహాలు చేస్తూ బాల్యాన్ని బలితీసుకుంటున్నారు.
Chaild Marriage: తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల వయసున్న చిన్నారిని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఉండే 29 ఏండ్ల యువకుడికి ఇచ్చి బాల్య వివాహం జరిపించారు. వద్దని ఎంతగా వారించినా ఆ పెద్దలు బలవంతపు పెళ్లి చేసేశారు. అత్తగారింటికి వెళ్లాలని వేధింపులు మొదలు కావడంతో ఆ చిన్నారి వెళ్లనంటూ మారాం చేసింది.
Chaild Marriage: అభంశుభం తెలియని ఆ చిన్నారి తాను చదువుకుంటానని తన తల్లిదండ్రులను వేడుకున్నది. అయినా ఆ మనసులు కరగలేదు. అత్తారింటికి వెళ్లాల్సిందేనని హుకూం జారీ చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఏకంగా ఆమె భర్తను రప్పించారు. దీంతో ఆ యువకుడు వచ్చిన ఆ బాలికను తన భుజాలపై ఊరవతల వరకు బలవంతంగా ఎత్తుకొని వెళ్లాడు. ఆనోటా ఈనోటా ఆ విషయం తెలియడంతో పోలీసులు ఎంటరయ్యారు. బాలికను వివాహమాడిన యువకుడిని, అతడి తమ్ముడిని, బాలిక తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

