farming

Farming: సహజ వ్యవసాయం కోసం కేంద్రం కొత్త పథకం

Farming: సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఒక ప్రధాన అడుగు వేస్తూ, సహజ వ్యవసాయం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.2,481 కోట్లకు ఆమోదం తెలిపింది. దీనికోసం రూ. 1,584 కోట్లు కేంద్రం వాటాగా ఉంటుంది. మిగిలిన రూ.897 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయి. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కోటి మంది రైతులకు చేరువయ్యే ఈ పథకం 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం కింద అమలవుతుంది. వచ్చే రెండేళ్లలో 15,000 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. కేంద్రం 7.5 లక్షల హెక్టార్ల భూమిలో సహజ వ్యవసాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో పెరిగిన పర్యాటకులు

Farming: వ్యవసాయం,  రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్వతంత్ర కేంద్ర ప్రాయోజిత పథకం గా దీనికి ప్రారంభిస్తున్నారు. NMNF అనే ఈ సహజ వ్యవసాయ పథకం భారతీయ సంప్రదాయాలలో పాతుకుపోయిన రసాయన రహిత, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అందరికీ సురక్షితమైన, పోషకమైన ఆహారాన్ని అందించే స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం,  ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడం, స్థానికంగా లభించే ఆవు ఆధారిత ఎరువును ఉపయోగించడం ద్వారా నేల నాణ్యతను మెరుగుపరచడం అలాగే  ఆధునిక వ్యవసాయంలో ఉన్న ఇబ్బందులను తగ్గించడం కూడా దీని లక్ష్యం. అంతేకాకుండా, NMNF వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాలలో రైతులకు సహజ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి 2,000 నమూనా ప్రదర్శన క్షేత్రాలను కూడా ఏర్పాటు చేస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Moringa Leaves Benefits:ఈ ఆకుతో చేసిన హెయిర్ మాస్క్ అప్లై చేస్తే నల్లని నిగ నిగలాడే జుట్టు గ్యారెంటీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *